Advertisement

ఇవాళ జగన్ ప్రెస్ మీట్ అంతా ఓ డ్రామాలా ఉంది: దీపక్ రెడ్డి

Deepak Reddy take a jibe at Jagan press meet
  • ఏపీలో సోషల్ మీడియా పోస్టుల రగడ
  • ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తోందంటూ జగన్ ఫైర్
  • ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపణ
  • జగన్ ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్న దీపక్ రెడ్డి
వైసీపీ అధినేత జగన్ ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం తెలిసిందే. తమ కార్యకర్తలు ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ వ్యాఖ్యలకు సీడ్ ఏపీ చైర్మన్ దీపక్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఇవాళ జగన్ మీడియా సమావేశం అంతా ఓ డ్రామాలా ఉందని విమర్శించారు.  

జగన్ పాలనలో మహిళలపై అత్యాచారాలు, అరాచకాలకు అడ్డు అదుపు లేదని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అరాచకాలను అరికట్టామని వెల్లడించారు. దీన్ని ఓర్వలేక వైసీపీ సోషల్ మీడియాలో నీచ రాతలు రాయిస్తున్నారని దీపక్ రెడ్డి ఆరోపించారు. మహిళల శీల హననం చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారని... ఇలాంటి ఘోరమైన పోస్ట్ లు పెడితే చర్యలు తీసుకోక జగన్ లా ముద్దులు పెట్టాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సొంత తల్లి, చెల్లిపై కూడా రోత రాతలు రాయించిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్ రెడ్డేనని అన్నారు. వర్రా రవీంద్రారెడ్డి లాంటి పిచ్చిమూకలను పెట్టుకుని. పచ్చి బూతులతో సోషల్ మీడియా వేదికగా సైకో చేష్టలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. హోంమంత్రిపైనే వల్గర్ పోస్టులు పెడుతున్నారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  కుమార్తెలను సోషల్ మీడియాలో ఏడిపించారని దీపక్ రెడ్డి పేర్కొన్నారు. 

ఈ పిల్ల సైకో పిశాచాలను అరెస్ట్ చేస్తుంటే.. జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నాడని విమర్శించారు. జగన్ ను వీడి అందరూ పారిపోతున్నారని... ఎవరూ పార్టీ నుంచి వెళ్లిపోకుండా ఉండేందుకే జగన్ జమిలి ఎన్నికల మంత్రం చదువుతున్నాడని ఎద్దేవా చేశారు. వైసీపీ పార్టీ వచ్చే ఎలక్షన్ కు ఉండదని దీపక్ రెడ్డి జోస్యం చెప్పారు. వైసీపీ నేతలకు దమ్ముంటే 11 న అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. 

"మహిళలపై సోషల్ మీడియా వేదికగా రాయలేని భాషలో పోస్టులు పెడుతున్న వైసీపీ కాలకేయులను పెంచి పోషిస్తున్న నీకు మహిళలపై మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది జగన్ రెడ్డి? నీ తల్లి, చెల్లెళ్లపై కూడా సోషల్ మీడియాలో రోత పోస్టులు పెట్టిస్తున్నావ్.  నీ పిన్నమ్మ తాళి తెంచిన వాడికి రక్షణ కల్పించావ్. నీ పాలనలో తమకు రక్షణ లేదని చెల్లెళ్లు సునీత, షర్మిల వేడుకునే పరిస్థితి కల్పించావ్.

చంద్రబాబు నాయకత్వంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. గంజాయి , డ్రగ్స్ పై సిట్ వేసి ఉక్కుపాదంతో చర్యలు తీసుకుంటున్నాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులను వెంటనే శిక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇవన్నీ చూసి ఓర్వలేక అవినీతి సాక్షి, సోషల్ మీడియా వేదిక వైసీపీ కాలకేయులతో వికృత ప్రచారం చేయిస్తావా జగన్ రెడ్డీ?  

రాజకీయ లబ్ధి కోసం సోషల్ మీడియా వేదికగా మహిళలపై నీచపు రాతలు రాయడానికి సిగ్గు అనిపించడం లేదా?  ఇకనైనా బుద్ధి తెచ్చుకో...లేకపోతే రాష్ట్ర మహిళలు చీపుర్లతో నీకు సన్మానం చేసే రోజు దగ్గరలోనే ఉంది" అంటూ దీపక్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Advertisement
Deepak Reddy
Jagan
Press Meet
TDP-JanaSena-BJP Alliance
YSRCP
Social Media
Andhra Pradesh

More Telugu News