Thammudu: 'తమ్ముడు' నితిన్‌ పరాజయాలకు ఫుల్‌స్టాప్‌ పెడుతుందా?

Will Thammudu put a stop to Nithiin defeats
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ కథానాయకుడు నితిన్‌ గత కొంతకాలంగా సరైన సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. 'భీష్మ' చిత్రం తరువాత నితిన్‌ మరో విజయాన్ని అందుకోలేదు. అయితే ప్రస్తుతం నితిన్‌ గతంలో తనకు 'భీష్మ' లాంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాన్ని అందించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో 'రాబిన్‌ హుడ్‌' చిత్రంలో నటిస్తున్నాడు. దీంతోపాటు వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో 'తమ్ముడు' చిత్రంలో నటిస్తున్నాడు. 'రాబిన్‌ హుడ్‌' చిత్రం డిసెంబరులో విడుదలకు రెడీగా వుంది. 

ఇక 'తమ్ముడు' చిత్రాన్ని మహా శివరాత్రికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ను మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్టర్‌లో కాగడా చేత పట్టిన నితిన్‌... భుజం మీద పాపను ఎత్తుకుని ఏదో ఆపద నుంచి పాపను రక్షిస్తున్నట్లుగా కనిపిస్తుంది. నితిన్‌ పాటు ఊరి ప్రజలు కూడా కాగడాలతో ఆయన వెంటే ఉండటం పోస్టర్‌లో చూడొచ్చు. 

ఇంతకు ముందు నానితో ఎంసీఎ, పవన్‌ కల్యాణ్‌తో వకీల్‌సాబ్‌ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన వేణు శ్రీరామ్‌ 'తమ్ముడు'ను కూడా ఓ వినూత్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నాడని తెలిసింది. ఈ చిత్రం నితిన్‌ కెరీర్‌లో పత్యేకంగా ఉంటుందని, ఇప్పటి వరకు నితిన్‌ టచ్‌ చేయని జానర్‌లో రూపొందుతున్న ఈ  సినిమా నితిన్‌కు మంచి సక్సెస్‌ను ఇస్తుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది.  ఈ చిత్రంలో హీరోయిన్‌ లయ ఓ కీలకపాత్రలో కనిపించబోతోంది. అజనీష్‌ లోక్‌నాథ్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నాడు. 


Go Back to Shorts
Thammudu
Nithiin
Sriram Venu
Dil Raju
Thammudu release date
Nithiin latest news
tollywood
Cinema

More Telugu News