రూ.200 కోట్ల బడ్జెట్‌తో లారెన్స్ సినిమా!
- 'కాలభైరవ' టైటిల్‌తో లారెన్స్ చిత్రం
- మాస్ పాత్రలో రాఘవ లారెన్స్
- వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల
యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా రూపొందనున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాంచన, గంగ, డ్యాన్స్ వంటి చిత్రాలతో నటుడిగా తన ప్రతిభను చాటుకున్న రాఘవ లారెన్స్ ఈ చిత్రంలో పూర్తి మాస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్నివివరాలు త్వరలోనే తెలుస్తాయి.