తిరుపతిలో రెండు హోటళ్లు, వరదరాజస్వామి ఆలయానికి బాంబు బెదిరింపులు
- ఈమెయిల్స్ ద్వారా బెదిరింపులు
- రంగంలోకి స్నిఫర్ డాగ్స్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్లు
- ఆ బెదిరింపులు ఉత్తుత్తివేనని తేల్చిన పోలీసులు
రెండు హోటళ్లకు, వరదరాజస్వామి ఆలయానికి ఇవాళ ఈమెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో ఆందోళన నెలకొంది. హోటళ్లు, ఆలయ ప్రాంగణంలో బాంబులు ఉన్నట్టు ఆ ఈమెయిల్స్ సారాంశం. దాంతో, హోటళ్ల యాజమాన్యాలు, ఆలయ వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి.
వెంటనే స్పందించిన పోలీసులు స్నిఫర్ డాగ్స్ ను, బాంబు డిస్పోజల్ స్క్వాడ్లను రంగంలోకి దింపారు. క్షుణ్ణంగా సోదాలు చేసినప్పటికీ ఎలాంటి బాంబులు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.