మీడియా ప్రతినిధులకు బిర్యానీ ట్రీట్ ఇచ్చిన 'వేట్టయాన్' టీమ్
- భారీ వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను క్రియేట్ చేస్తున్న వేట్టయాన్
మూవీ - రూ.129 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు టాక్
- థాంక్స్ గివింగ్ మీట్ పేరుతో చెన్నైలో విజయోత్సవ వేడుకను నిర్వహించిన చిత్ర బృందం
ఈ నేపథ్యంలో చిత్ర బృందం థాంక్స్ గివింగ్ మీట్ పేరుతో చెన్నైలో విజయోత్సవ వేడుక నిర్వహించింది. ఈ వేడుకలకు చిత్ర బృందంతో పాటు పలువురు ప్రముఖులు, అభిమానులు, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. హాజరైన ప్రతి ఒక్కరికి విందు భోజనాలు వడ్డించారు. డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ స్వయంగా చిత్ర బృందంతో కలిసి మీడియా ప్రతినిధులకు బిర్యానీ వడ్డించారు. హీరోయిన్ రితికా సింగ్ సైతం అతిధులకు స్వయంగా వడ్డన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మూవీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే, ఇటీవల జరిగిన సర్జరీ కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న రజనీకాంత్ ఈ విజయోత్సవ వేడుకకు హజరు కాలేకపోయారని తెలుస్తోంది.