Salman Khan: స‌ల్లూ భాయ్‌కు మ‌రోసారి బెదిరింపులు.. రూ.5కోట్ల డిమాండ్‌!

Bollywood Actor Salman Khan get Another Threat Message and Demand Rs 5Crore
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్‌కు మ‌రోసారి బెదిరింపులు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న శ‌త్రుత్వం స‌మాప్తం కావాలంటే రూ.5 కోట్లు ఇవ్వాల‌ని అగంతు‌కులు డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ముంబ‌యి ట్రాఫిక్ పోలీసుల వాట్స‌ప్ నంబ‌ర్‌కు గురువారం రాత్రి ఓ సందేశం వ‌చ్చింది. దాంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. 

"ఈ బెదిరింపుల‌ను ఎట్టిప‌రిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోవ‌ద్దు. స‌ల్లూ భాయ్ ప్రాణాల‌తో ఉండాల‌న్నా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో వైరానికి ముగింపు ప‌ల‌కాల‌న్నా ఆయ‌న రూ. 5 కోట్లు ఇవ్వాలి. ఈ న‌గ‌దు ఇవ్వ‌కుంటే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ (ఇటీవ‌ల హ‌త్య‌కు గురైన నేత‌) కంటే దారుణ‌మైన ప‌రిస్థితులు చూడాల్సి వ‌స్తుంది" అని అగంతతుకులు ఆ సందేశంలో పేర్కొన్నారు. 

కాగా, ఈ బెదిరింపుల‌పై ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఆ సందేశం ఎక్క‌డి నుంచి వ‌చ్చింద‌నే విష‌య‌మై విచార‌ణ చేస్తున్న‌ట్లు చెప్పారు. 
Go Back to Shorts
Salman Khan
Bollywood
Lawrence Bishnoi

More Telugu News