సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు మహారాష్ట్రలో... భట్టి విక్రమార్కకు ఝార్ఖండ్ లో... ఏఐసీసీ కీలక బాధ్యతలు

సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు మహారాష్ట్రలో... భట్టి విక్రమార్కకు ఝార్ఖండ్ లో... ఏఐసీసీ కీలక బాధ్యతలు

Uttam Seethakka among 11 Congress leaders appointed as AICC senior observers for Maharashtra Assembly polls
  • మహా అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ అబ్జర్వర్లుగా నియమించిన ఏఐసీసీ
  • ఝార్ఖండ్‌ లో పరిశీలకుడిగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
  • ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఏఐసీసీ
తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలకు ఏఐసీసీ కీలక బాధ్యతలను అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ అబ్జర్వర్లుగా వారిని నియమించింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు దక్కింది.

మహారాష్ట్రలోని ఐదు డివిజన్లకు 11 మందిని నియమించగా... ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క ఉన్నారు. ఇక, ఝార్ఖండ్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు తారిక్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరిని పరిశీలకులుగా నియమించారు.
Advertisement
Seethakka
Uttam Kumar Reddy
Assembly Elections
AICC
Maharashtra

More Telugu News