హైదరాబాద్ టీ20లో టాస్ గెలిచిన టీమిండియా

హైదరాబాద్ టీ20లో టాస్ గెలిచిన టీమిండియా

Team India won the toss in 3rd T20
  • టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • 5 ఓవర్లలో 1 వికెట్ కు 63 పరుగులు చేసిన భారత్
హైదరాబాదులో నేడు టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య చివరిదైన మూడో టీ20 జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. 23 పరుగుల స్కోరు వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన ఓపెనర్ అభిషేక్ శర్మ బంగ్లా బౌలర్ టాంజిమ్ హసన్ సకీబ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. 

ప్రస్తుతం భారత్ స్కోరు 5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 63 పరుగులు. ఓపెనర్ సంజు శాంసన్ 36, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో టీమిండియా ఇప్పటికే 2-0తో సిరీస్ గెలిచింది. దాంతో ఇవాళ్టి మూడో టీ20 నామమాత్రంగా మారింది. అయితే క్లీన్ స్వీప్ చేయాలని భారత్, పరువు కోసం బంగ్లాదేశ్ ప్రయత్నించే అవకాశాలుండడంతో... పోరు ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నారు.
Advertisement
Team India
Hyderabad
3rd T20
Bangladesh

More Telugu News