చాలా సక్సెస్ లు చూశా.. ఇది మాత్రం స్పెషల్: కొరటాల శివ
- బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'దేవర'
- 'ఆచార్య' పరాజయం తర్వాత హిట్ కొట్టిన కొరటాల
- కొరటాల ముఖంలో సంతోషాన్ని చూస్తున్నానన్న తారక్
ఈ సందర్భంగా కొరటాల శివ మాట్లాడుతూ... తాను ఎన్నో సక్సెస్ లు చూశానని, కానీ ఈ సక్సెస్ చాలా స్పెషల్ అని చెప్పారు. చిరంజీవితో చేసిన 'ఆచార్య' మూవీ ఫ్లాప్ కావడంతో... కొరటాల శివపై ఎన్నో విమర్శలు వచ్చాయి. కొరటాల వల్లే సినిమా ఫెయిల్ అయిందని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే, కొరటాల పైవ్యాఖ్యలు చేశారు. 'దేవర' హిట్ తో ఆయన తన సత్తాను మరోసారి చాటారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ... ఈ సినిమా విజయంతో కొరటాల ముఖంలో సంతోషాన్ని, మనశ్శాంతిని చూస్తున్నానని చెప్పారు.