తెలంగాణలో మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
- తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడి
- నేటి నుంచి 6వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు
- రంగారెడ్డి, హైదరాబాద్, జనగాం సహా పలు జిల్లాల్లో వర్షాలు
అక్టోబరు 3వ తేదీ నుంచి 4వ తేదీ వరకు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
అక్టోబరు 4వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
అక్టోబరు 5వ తేదీ నుంచి 6వ తేదీ వరకు నిజామాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.