అన్నిటికీ మించి ఈ వ్యక్తి కూడా ఓ హిందువే: డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర ట్వీట్
- తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం
- వైసీపీ, కూటమి నేతల మధ్య మాటల యుద్ధం
- పొన్నవోలు వ్యాఖ్యలను ఖండించిన పవన్ కల్యాణ్
ఈ ట్వీట్ లోని వీడియోలో... పొన్నవోలు వ్యాఖ్యలు, పొన్నవోలు వ్యాఖ్యలను పవన్ ఖండించడం చూడొచ్చు.
ఇక నేటి ట్వీట్ లో పవన్ ఏమని పేర్కొన్నారంటే... వైసీపీ ప్రభుత్వంలో ఏఏజీగా పనిచేసిన వ్యక్తి తిరుమల లడ్డూపై అవాంఛనీయ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. అన్నిటికీ మించి ఈ వ్యక్తి కూడా ఓ హిందువేనని ఎత్తిపొడిచారు. ఈ విధంగా జనాలు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తున్నారని పవన్ తన ట్వీట్ లో ఆవేదన వెలిబుచ్చారు.