పవన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య

YSRCP Ex MLA Kilari Roshaiaha meets Pawan Kalyan
  • ఇటీవలే వైసీపీకి గుడ్ బై చెప్పిన కిలారి రోశయ్య
  • రేపు జనసేనలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే
  • గత ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రోశయ్య
వైసీపీ నుంచి ఇతర పార్టీలలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవలే వైసీపీకి మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య రాజీనామా చేశారు. ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు. కిలారి రోశయ్య రేపు జనసేనలో చేరుతారని ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. 

2019 ఎన్నికల్లో రోశయ్య పొన్నూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రోశయ్యతో పాటు ఆయన వియ్యంకుడు రవిశంకర్ కూడా జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు.
Advertisement
Kilari Roshaiah
Pawan Kalyan
Janasena

More Telugu News