ఇవాళ్టి నుంచే ఐఫోన్ 16 విక్రయాలు!
- స్మార్ట్ ఫోన్లపై కేంద్రం దిగుమతి సుంకం తగ్గింపు
- తగ్గనున్న ఐ ఫోన్ 16 సిరీస్ మొబైల్ ధరలు
- మొబైల్ ధరలను ప్రకటించిన ఆపిల్
ఇటీవలి కేంద్ర బడ్జెట్లో స్మార్ట్ ఫోన్లపై దిగుమతి సుంకం తగ్గించిన నేపథ్యంలో గత వర్షన్ ఐ ఫోన్ల కంటే ఐ ఫోన్ 16 సిరీస్ మొబైల్ ధరలు తగ్గనున్నాయి. ఐ ఫోన్ 16 ప్రో మొబైల్ ధర రూ.1,19,900లు, ఐ ఫోన్ 16 ప్రో మ్యాక్స్ మొబైల్ ధర రూ.1,44,900 నుండి ప్రారంభం అవుతుందని ఆపిల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఐ ఫోన్ 16 మొబైల్, ఐ ఫోన్ 16 ప్లస్ ధరల్లో ఎటువంటి మార్పు లేదని ఆపిల్ తెలిపింది. ఐ ఫోన్ 16 మొబైల్ ను రూ.79,900లు, ఐ ఫోన్ 16 ప్లస్ మొబైల్ ను రూ.89,900లకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.