Pawan Kalyan: సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan wrote CM Chandrababu
షార్ట్స్‌లో చూడండి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నేడు లేఖ రాశారు. మంగళగిరిలోని తన నివాసాన్ని ఇకపై క్యాంపు కార్యాలయంగానూ ఉపయోగించుకుంటానని వెల్లడించారు. అందుకే, విజయవాడలో కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని, ఫర్నిచర్, ఇతర సామగ్రి సహా వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని పవన్ తన లేఖలో పేర్కొన్నారు. 

విజయవాడలో ఎంతో విశాలమైన క్యాంపు కార్యాలయాన్ని తనకు కేటాయించడం పట్ల చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఇకపై మంగళగిరిలోని నివాసం నుంచే కార్యకలాపాలు కొనసాగించాలని నిర్ణయించుకున్నందున, విజయవాడ క్యాంపు కార్యాలయాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగిస్తున్నానని జనసేనాని వివరణ ఇచ్చారు. 

Go Back to Shorts
Pawan Kalyan
Chandrababu
Camp Office
Vijayawada
Janasena
TDP-JanaSena-BJP Alliance

More Telugu News