ఇలాంటి సినిమాలు ఫ్లాప్ అయినందుకు చాలా సంతోషం.. 'భార‌తీయుడు-2'పై రేణు దేశాయ్ పోస్ట్ వైర‌ల్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇలాంటి సినిమాలు ఫ్లాప్ అయినందుకు చాలా సంతోషం.. 'భార‌తీయుడు-2'పై రేణు దేశాయ్ పోస్ట్ వైర‌ల్‌!

Renu Desai Slams Indian 2 Says It Deserves Flop
  • క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్ కాంబోలో 'భార‌తీయుడు-2'
  • ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయిన మూవీ
  • సినిమాలోని వీధి కుక్క‌ల‌పై క‌మ‌ల్ చెప్పే డైలాగ్‌పై రేణు దేశాయ్ మండిపాటు
  • అస‌లు రైట‌ర్స్ ఇలాంటి డైలాగ్స్ ఎలా రాస్తారంటూ ఆగ్ర‌హాం
క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్ కాంబోలో వ‌చ్చిన 'భార‌తీయుడు-2' మూవీ జనాద‌ర‌ణ పొంద‌లేక‌పోయిన విష‌యం తెలిసిందే. 90ల‌లో వ‌చ్చిన సూప‌ర్ హిట్ 'భార‌తీయుడి'కి సీక్వెల్‌గా వ‌చ్చిన ఈ సినిమా డిజాస్ట‌ర్ గా మిగిలింది. దీంతో భార‌తీయ సినిమా గ‌ర్వించేలా ఎన్నో అద్భుత‌మైన చిత్రాల‌ను అందించిన‌ ద‌ర్శ‌కుడు శంక‌ర్‌కి ఏమైందంటూ సినీ ప్రేమికులు తిట్టుకున్నారు కూడా. 

ఇక 'ఇండియ‌న్‌-2'లో కొన్ని డైలాగ్స్ పెట్ ల‌వ‌ర్స్ ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌య్యాయి. ముఖ్యంగా వీధి కుక్క‌ల‌పై ఉన్న డైలాగ్ కాంట్రావ‌ర్సీకి కార‌ణ‌మైంది. దీనిపై నెట్టింట ప‌లువురు ఇప్ప‌టికే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాజాగా ఇదే విష‌య‌మై ప్రముఖ సినీ న‌టి రేణు దేశాయ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా మండిప‌డ్డారు. అస‌లు రైట‌ర్స్ ఇలాంటి సంభాష‌ణలు ఎలా రాస్తారో అని ఆమె కోప‌గించుకున్నారు. అందుకే ఈ మూవీ ఫ్లాప్ అయినందుకు చాలా సంతోషంగా ఉంద‌ని ఆమె పేర్కొన్నారు. 

ఈ మూవీలోని కమల్ హాసన్ వీధి కుక్కలను కించపరిచే విధంగా చెప్పే డైలాగ్ తాలూకు క్లిప్‌ను ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా షేర్ చేశారు. ఆ క్లిప్‌కు "ఇలాంటి సినిమాలు ఫ్లాప్ అయినందుకు నిజంగా సంతోషిస్తున్నాను. ఈ ఇడియట్‌ రైటర్స్ ఎలా రాస్తారు ఇలాంటి డైలాగ్స్‌? అస‌లు వాళ్ల‌కి ఏమైంది?" అని ఆమె ఈ పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చారు. దాంతో రేణు దేశాయ్ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

Advertisement
Renu Desai
Indian 2
Tollywood

More Telugu News