Rains: భారీ వర్షాల నుంచి తెలంగాణకు ఊరట!

No heavy rains in Telangana from tomorrow
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణకు భారీ వర్షాల నుంచి ఊరట లభించింది. రేపటి నుంచి... తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు నుంచి రేపటి వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

ఇక రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
Go Back to Shorts
Rains
Hyderabad
Telangana

More Telugu News