తెలంగాణలో మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు
- పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
- గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం
- పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
నేటి నుంచి రేపటి వరకు ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.
రేపటి నుంచి ఎల్లుండి వరకు నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.
అలాగే, అన్ని జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది.
శనివారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది. ఆదివారం, సోమవారం, మంగళవారం కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.