తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై మార్గదర్శకాల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్‌గా కేబినెట్ సబ్ కమిటీ
- కమిటీ సభ్యులుగా మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీపై అధ్యయనం చేయనున్న కమిటీ
కాగా, ఈ కమిటీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డు లబ్దిదారుల ఎంపికపై అధ్యయనం చేసి విధివిధానాలను ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ప్రస్తుతం రేషన్ కార్డు లబ్దిదారులకే ఉచిత ఆరోగ్య వైద్య సేవలు (హెల్త్ కార్డు) అందుబాటులో ఉన్నాయి. అయితే ఉచిత వైద్య సేవల కోసం అనర్హులు కూడా రేషన్ కార్డులు పొందుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే రేషన్ కార్డు, హెల్త్ కార్డు లింక్‌ను తొలగించి వేర్వేరుగా కార్డులు మంజూరు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.