పవన్ కల్యాణ్ అద్భుతాలు సృష్టిస్తారు: సినీ నటి శ్రియా శరణ్
- ఎన్నికల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయం దక్కించుకున్నారన్న శ్రియా
- ఆయన గెలుపు పట్ల గర్వపడుతున్నానని వ్యాఖ్య
- ప్రజలకు మంచి చేయాలనే తపన కలిగిన వ్యక్తి పవన్ అన్న శ్రియ
ఇద్దరం కలిసి గతంలో 'బాలు' సినిమాకు పని చేశామని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆయన చాలా సైలెంట్ వ్యక్తి అని, శ్రమపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని ప్రశంసించారు. ఈ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ సమయంలో ఆయన కాలికి గాయమైందని, పాట షూట్ పూర్తయ్యే వరకు ఆయన ఎవరికీ ఈ విషయం చెప్పలేదన్నారు.
తన గురించి మాట్లాడుతూ... ప్రస్తుతం తాను షో టైమ్ అనే కార్యక్రమం కోసం పని చేస్తున్నానని తెలిపారు. బాలీవుడ్‌లో కూడా మంచి అవకాశాలు వస్తున్నట్లు చెప్పారు. అలాగే తేజ సజ్జా సినిమాలో నటిస్తున్నట్లు చెప్పారు. సినిమాకు భాషతో సంబంధం లేదని, కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్నారు. తనకు భారత చిత్ర పరిశ్రమ అంటే ఇష్టమని తెలిపారు.