ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిసిన సినీ నటుడు సుమన్
- నేడు అమరావతి వచ్చిన సుమన్
- ఏపీ మంత్రులతో మర్యాదపూర్వక సమావేశం
- కూటమి విజయం పట్ల మంత్రులకు అభినందనలు
- సుమన్ ను సన్మానించిన కొల్లు రవీంద్ర
అమరావతి వచ్చిన సందర్భంగా సుమన్ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కూడా కలిశారు. కల్తీ మద్యం కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని సుమన్ కోరారు. తన చాంబర్ కు వచ్చిన సుమన్ ను మంత్రి కొల్లు రవీంద్ర ఘనంగా సత్కరించారు. కాగా, సుమన్ చేతికి గాయం అయినట్టు తెలుస్తోంది. ఆయన బ్యాండేజ్ తో కనిపించారు.