ఉప్పాడ వెళ్తూ రోడ్డు పక్కన జనసేన జెండా ఊపుతున్న చిన్నారిని చూసి కారు ఆపిన పవన్ కల్యాణ్.. వీడియో ఇదిగో!
- నేడు ఉప్పాడలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్
- సాయంత్రం 4 గంటలకు వారాహి బహిరంగ సభ
- చిన్నారికి షేక్ హ్యాండ్ ఇచ్చిన పవన్
- పవన్ కాళ్లు మొక్కిన అభిమాని
కాగా, పవన్ పిఠాపురం వెళ్తున్నప్పుడు ఆసక్తికర ఘటన ఒకటి చోటుచేసుకుంది. పవన్ కాన్వాయ్ తమ ఇంటి ముందు నుంచి వెళ్తుందన్న విషయం తెలిసిన ఓ కుటుంబంలోని చిన్నారి జనసేన జెండా పట్టుకుని రోడ్డు పక్కన నిల్చుని ఊపుతున్నాడు. అంతలోనే అటుగా వచ్చిన పవన్ అదిచూసి తన కారు ఆపారు.
కారు ఆగడంతోనే చిన్నారి పరిగెత్తాడు. కిందికి దిగిన పవన్ అతడికి షేక్‌హ్యాండ్ ఇచ్చి కారెక్కబోయారు. ఈలోపు పవన్ భద్రతా సిబ్బంది పిల్లాడిని పట్టుకుని పవన్ వద్దకు తీసుకెళ్లారు. ఈలోపు అక్కడికి వచ్చిన అభిమానుల్లో ఒకరు పవన్ కాళ్లకు దండం పెట్టడం కనిపించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి పవన్ అభిమానులు తెగ ముచ్చటపడిపోతున్నారు.