ట్రాఫిక్ చిక్కులు ఇచ్చిన చక్కటి ముచ్చట... ఆసక్తికర ఫొటో పంచుకున్న జనసేన
- ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కల్యాణ్
- అనంతరం మంగళగిరిలోని తన నివాసానికి వెళుతుండగా ట్రాఫిక్ జామ్
- రోడ్డు పక్కన సేద దీరుతూ ఫొటో క్లిక్ మనిపించిన వైనం
'ట్రాఫిక్ చిక్కులు ఇచ్చిన చక్కటి ముచ్చట' అని ఈ ఫొటోకు శీర్షిక పెట్టింది. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత క్లిక్ మనిపించిన అందమైన ఫొటో ఇది. ప్రమాణస్వీకారం చేసి మంగళగిరిలోని నివాసానికి బయల్దేరాలని అనుకుంటే... ట్రాఫిక్ చిక్కులు ఏర్పడ్డాయి. వాహనాన్ని రోడ్డు పక్క నిలిపివేసి సేద దీరిన క్షణంలో కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న ఫొటో ఇది" అని జనసేన వివరించింది.