White Ration Card: ఏపీలో తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త

Toor dal and Sugar will be suplied to white ration card holders in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పింది. ఇకపై బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార వంటి నిత్యావసరాలను కూడా అందించనుంది. 

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు కందిపప్పు సేకరణకు చర్యలు తీసుకున్నారు. భారీ మొత్తంలో కందిపప్పు కొనుగోలు చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచారు. 

ఇప్పటికే అధికారులు బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, నూనె ప్యాకెట్లను పంపిణీకి అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిని జులై 1 నుంచి తెల్ల రేషన్ కార్డుదారులకు అందించనున్నారు. పలు జిల్లా కేంద్రాల్లోని ఎంఎల్ఎస్ పాయింట్లకు చేరిన నిత్యావసరాలను అధికారులు తూకం వేసి పరిశీలించారు.
Go Back to Shorts
White Ration Card
Toor Dal
Sugar
Rice
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News