ఆరోగ్యశ్రీలో గత ప్రభుత్వ అవకతవకలపై విచారణ జరిపిస్తాం: మంత్రి సత్యకుమార్
- క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం
- మారుమూల గ్రామానికి మెరుగైన ఆరోగ్య సదుపాయాల కల్పన
- ఆసుపత్రులలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధ్యాన్యం
- బాధ్యతలు స్వీకరించాక మీడియాతో మాట్లాడిన మంత్రి సత్యకుమార్
‘గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిచేసి, వైద్యంలో రాష్ట్రాన్ని ఆదర్శనీయంగా తీర్చిదిద్దుతాం. క్యాన్సర్ చికిత్సకు అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు ఈ మహమ్మారి నివారణ కోసం చర్యలు తీసుకుంటాం. వైద్యారోగ్య శాఖ సిబ్బంది సంక్షేమ, ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, ఎయిమ్స్ తరహాలో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తాం’ అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.