'కాంచన 4'లో మృణాల్ ఠాకూర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కాంచన 4'లో మృణాల్ ఠాకూర్!

Kanchana 4 in Mrunal Thakur
  • లారెన్స్ నుంచి 'కాంచన 4'
  • ఇటీవలే ప్రకటించిన మేకర్స్ 
  • త్వరలో సెట్స్ పైకి వెళుతున్న సినిమా 
  • మృణాల్ తో జరుగుతున్న సంప్రదింపులు 

లారెన్స్ కి అటు దర్శక నిర్మాతగా .. ఇటు హీరోగా మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టిన సిరీస్ 'కాంచన' అని చెప్పాలి. 'కాంచన' .. 'కాంచన 2' సినిమాలు భారీ వసూళ్లను కురిపించాయి. అదే తరహాలో 'కాంచన 3' చేసినప్పటికి, ఆ స్థాయిలో ఆడలేదు. యావరేజ్ అనిపించుకుంది. దాంతో 'కాంచన 4' ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులంతా చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే లారెన్స్ 'చంద్రముఖి 2' చేశాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా, ఆశించిన స్థాయి రెస్పాన్స్ ను రాబట్టుకోలేకపోయింది. ఆ సినిమాతో నిరాశపడిన అభిమానులను హుషారెత్తిస్తూ, 'కాంచన 4'తో సెట్స్ పైకి వెళుతున్నట్టుగా లారెన్స్ ఇటీవల ప్రకటించాడు. దాంతో ఈ సినిమాలో కథానాయికగా ఎవరిని తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది. 

ఈ క్రమంలో మృణాల్ ఠాకూర్ పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమా కోసం ఆమెను సంప్రదిస్తున్నారని అంటున్నారు. వరుసగా రెండు హిట్లు అందుకున్న మృణాళిని, 'ఫ్యామిలీ స్టార్'తో హ్యాట్రిక్ హిట్ అందుకుంటుందని అంతా అనుకున్నారు గానీ, అలా జరగలేదు. ఇప్పుడు ఆమె 'కాంచన 4'కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉండనే టాక్ వినిపిస్తోంది. 

Advertisement
Mrunalini Thakur
Lawrence
Kollywood

More Telugu News