పవన్ అంటే పవనం అనుకున్నారేమో... తుపాను: నరేంద్ర మోదీ
- ఎన్డీయే పక్ష నేతగా ఎన్నికైన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగం
- ఏపీ ప్రజలు తమకు అతిపెద్ద బహుమతి ఇచ్చారని వ్యాఖ్య
- ఏపీలో చారిత్రక విజయం సాధించినట్లు చంద్రబాబు తనతో చెప్పారన్న మోదీ
- పవన్ మన సమక్షంలోనే ఉన్నారని కూటమి నేతలతో మోదీ వ్యాఖ్య
ప్రధాని వ్యాఖ్యలతో పవన్ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం, ప్రధాని ప్రసంగం కొనసాగిస్తూ... ఏపీలో కూటమి సాధించింది మామూలు విజయం కాదని, మహా విజయం అని కొనియాడారు. ఆ భారీ విజయం ఏపీ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందని అన్నారు. ఏపీ ప్రజలు తమకు ఇచ్చిన బహుమతిగా ఈ విజయాన్ని భావిస్తామని చెప్పారు.
ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో క్లీన్ స్వీప్ చేశామని, ముఖ్యంగా ఏపీలో చంద్రబాబుతో కలిసి చారిత్రాత్మక విజయం సాధించామని తెలిపారు. ఏపీ ప్రజలు తమకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారని మోదీ హర్షం వ్యక్తం చేశారు.