'మజాకా'లో హీరోకి తల్లి పాత్రలో 'మన్మథుడు' అన్షూ!
- సందీప్ కిషన్ హీరోగా 'మజాకా'
- ఆయన జోడీ కడుతున్న రీతూ వర్మ
- సంగీతాన్ని అందిస్తున్న భీమ్స్
- ఈ నెలలోనే సెట్స్ పైకి వెళుతున్న సినిమా
ఈ సినిమా కోసం 'స్టిల్ బ్యాచ్ లర్' .. 'రేంజ్ మాస్టర్' అనే టైటిల్స్ ను పరిశీలించారు. అయితే 'ధమాకా' టైటిల్ సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని 'మజాకా' అనే టైటిల్ ను దాదాపు ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. ఈ సినిమాలో కథానాయికగా రీతూ వర్మ కనిపించనుంది. రాజేశ్ దండా ఈ సినిమాకి నిర్మాత.
ఈ సినిమాలో సందీప్ కిషన్ తండ్రిగా రావు రమేశ్ నటిస్తున్నాడు. ఇక హీరోకి తల్లిగా 'మన్మథుడు' బ్యూటీ అన్షూ కనిపించనుంది. 'మన్మథుడు' సినిమాతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆమె, ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ నెలలోనే సెట్స్ పైకి వెళుతున్న ఈ సినిమాకి, భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు.