'ఆహా' తెరపైకి ఒకే రోజు రెండు సస్పెన్స్ థ్రిల్లర్లు!
- క్రితం నెల థియేటర్లకు వచ్చిన 'మిరల్'
- భరత్ జోడీ కట్టిన వాణి భోజన్
- థ్రిల్లర్ జోనర్లో నడిచే కథాకథనాలు
- ఈనెల 7 నుంచి స్ట్రీమింగ్
ఈ రెండు సినిమాల్లో 'మిరల్' క్రితం నెలలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భరత్ - వాణి భోజన్ జంటగా నటించిన ఈ సినిమాకి, శక్తివేల్ దర్శకత్వం వహించాడు. కీలకమైన పాత్రలో కేఎస్ రవికుమార్ కనిపించనున్నాడు. ఈ నెల 7వ తేదీన ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.
కథలోకి వెళితే ఒక ప్రమాదం బారి నుంచి హీరో తప్పించుకున్న దగ్గర నుంచి అతనికి అదే పనిగా ఒక పీడకల వస్తూ ఉంటుంది. మానసిక పరమైన ఆ ఇబ్బంది నుంచి భర్తను తప్పించడం కోసం అతని భార్య ఒక పరిహారం చేయాలనుకుంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత ఏమౌతుంది? అనేది కథ.