పవన్ కల్యాణ్ భారీ విజయం... కృతజ్ఞతలు తెలిపిన అన్నా లెజ్నెవా, అకీరా
- పిఠాపురంలో పవన్ కల్యాణ్ విక్టరీ
- వంగా గీతపై 70,354 ఓట్ల భారీ ఆధిక్యం
- పవన్ నివాసం వద్ద కోలాహలం
- మద్దతుదారులకు చేతులెత్తి నమస్కరించిన అన్నా లెజ్నెవా
కౌంటింగ్ ట్రెండ్స్ బయటికి రాగానే పవన్ కల్యాణ్ నివాసం వద్ద కోలాహలం నెలకొంది. పవన్ భార్య లెజ్నెవా బయటకు వచ్చి మద్దతుదారులందరికీ చేతులెత్తి నమస్కరించారు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అటు అకీరా నందన్ కూడా తండ్రి విజయం పట్ల హర్షం వ్యక్తం చేశాడు.