పాయల్ రాజ్‌పుత్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘రక్షణ’... రిలీజ్ డేట్ ఇదే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాయల్ రాజ్‌పుత్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘రక్షణ’... రిలీజ్ డేట్ ఇదే!

Rakshana Movie Update
  • పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పాయల్ 
  • జూన్ 7న విడుదల కానున్న 'రక్షణ'
  • ప్రమోషన్స్ వేగాన్ని పెంచిన మేకర్స్ 
  • థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ

‘Rx100’ ..  ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఆమె ఇప్ప‌టివ‌ర‌కు చేసిన పాత్ర‌ల‌కు భిన్నంగా..ప‌వ‌ర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ‘రక్షణ’. 

రోష‌న్‌, మాన‌స్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా 'ర‌క్ష‌ణ' చిత్రం మెప్పించ‌నుంది. రీసెంట్‌గా విడుద‌లైన ఈ టీజ‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 7న విడుద‌ల చేస్తున్నారు. 

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ మాట్లాడుతూ ‘రక్షణ’ టీజ‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వస్తోంది. ఇదొక క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. పాయల్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన  ఘటన స్పూర్తితో రాసిన కథతో సినిమా రూపొందింది" అన్నారు. 

Advertisement
Payal
Rakshana

More Telugu News