హైదరాబాద్ ఆటోవాలా మ‌జాకా.. నీ ఐడియా అదుర్స్ బ్రో..!

Hyderabad Autowala Video goes Viral on Social Media
  • ఆటో వెనుక‌భాగంలో చిన్న కూల‌ర్ ఏర్పాటు చేసి అంద‌ర్నీ ఆక‌ర్షించిన ఆటోవాలా
  • ఎండ‌వేడిమికి తాళ‌లేక అల్లాడిపోతున్న ప్ర‌యాణికుల కోసం సరికొత్త ఆలోచ‌న‌
  • నెట్టింట హైద‌రాబాదీ ఆటోవాలా వీడియో వైర‌ల్‌
ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా భానుడి భ‌గ‌భ‌గ‌లు కొన‌సాగుతున్నాయి. ఎండ‌లు దంచి కొడుతున్నాయి. పొద్దున 10 గంట‌ల త‌ర్వాత ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లాలంటే‌నే జ‌నం జంకుతున్నారు. ఎండ‌వేడిమికి తాళ‌లేక ప్ర‌తి ఒక్క‌రూ అల్లాడిపోతున్నారు. ఇక ప్ర‌యాణాలు చేయాలంటే ఒక‌టికి రెండుసార్లు ఆలోచించాల్సిన ప‌రిస్థితి. అలాంటి వారి కోసం ఓ హైదరాబాదీ ఆటోవాలా స‌రికొత్త‌గా ఆలోచించాడు. 

త‌న ఆటో వెనుక‌భాగంలో చిన్న కూల‌ర్ ఏర్పాటు చేసి అంద‌ర్నీ ఆక‌ర్షించాడు. ఉక్క‌పోత‌, వేడిగాలుల నుంచి ప్ర‌యాణికుల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించేలా ఇలా ఏర్పాటు చేసిన‌ట్లు అత‌డు చెబుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజ‌న్లు నీ ఐడియా అదుర్స్ బ్ర‌ద‌ర్ అంటూ ఆటోవాలాను కొనియాడుతున్నారు.
Go Back to Shorts
Viral Videos
Hyderabad
Autowala
Social Media

More Telugu News