Amit Shah: కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తులు ఆలోచించాలి: అమిత్ షా విజ్ఞప్తి

Arvind Kejriwal bail decision not routine says Amit Shah
షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్‌ను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తులు ఆలోచించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ఆయన మధ్యంతర బెయిల్‌పై మాత్రమే వచ్చారని... తిరిగి జైలుకు వెళ్లవలసిందే అన్నారు. అమిత్ షా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వీలుకల్పిస్తూ సుప్రీంకోర్టు జూన్ 1 వరకు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. 

లోక్ సభ ఎన్నికల్లో ఆమ్ అద్మీ పార్టీ, కూటమి విజయం సాధిస్తే తాను మళ్లీ జైలుకు వెళ్లవలసిన అవసరం రాదని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను అమిత్ షా తప్పుబట్టారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమే అవుతుందన్నారు. ఏదైనా కేసులో దోషులుగా ఉన్నవారు విజయం సాధిస్తే... దోషులుగా తేలిన వారిని కోర్టు జైలుకు పంపదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బెయిల్‌ను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో న్యాయస్థానం ఆలోచించాలన్నారు.

తన అరెస్ట్ అక్రమమని కేజ్రీవాల్ చెబుతున్నారని... ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించలేదన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కోసం మాత్రమే మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు తెలిపారు. తిరిగి ఆయన జైలుకు వెళ్లవలసిందే అన్నారు. అలాంటప్పుడు ఇది కేజ్రీవాల్‌కు అనుకూల తీర్పు ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. తీహార్ జైల్లో కెమెరాల ద్వారా తన కదలికలు ప్రధాని కార్యాలయానికి చేరుతున్నాయన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలను అమిత్ షా ఖండించారు. జైలు పాలన అధికారం ఢిల్లీ ప్రభుత్వం పరిధిలో ఉంటుందన్నారు.
Go Back to Shorts
Amit Shah
Arvind Kejriwal
Lok Sabha Polls
BJP

More Telugu News