భూమిని తాకిన శక్తిమంతమైన సౌర తుపాను
- లండన్ కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో భూమిని తాకిన సూర్యుడి అయస్కాంత క్షేత్రాలు
- తీవ్ర సౌరతుపానును అంచనా వేసిన అమెరికా
- కమ్యూనికేషన్, పవర్ గ్రిడ్‌లకు అంతరాయం కలిగించే ఛాన్స్
కాగా ఈ సౌర తుపానుకు సంబంధించి ఉత్తర యూరప్, ఆస్ట్రేలియాలలో ఏర్పడిన ‘అరోరా’లకు సంబంధించిన ఫొటోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎలాంటి పరికరాలు లేకుండా దీనిని చూడగలిగామని పలువురు పేర్కొన్నారు.
తీవ్రమైన భూ అయస్కాంత తుపానుగా దీనిని ఎన్‌వోఏఏ అంచనా వేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని సీఎంఈలు భూమిని తాకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సౌర తుపాను కారణంగా భూమి అయస్కాంత క్షేత్రంలో సంభవించే సంభావ్య అంతరాయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉపగ్రహ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు, పవర్ గ్రిడ్‌లకు సూచించారు. కాగా అక్టోబర్ 2003లో సంభవించిన శక్తిమంతమైన సౌర తుపాను కారణంగా స్వీడన్‌లో బ్లాక్‌అవుట్‌లు ఏర్పడ్డాయి. దక్షిణాఫ్రికాలో విద్యుత్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.