ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న రాఘ‌వ లారెన్స్‌.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న రాఘ‌వ లారెన్స్‌.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు!

Raghava Lawrence Distribute Tractors to Farmers
  • 10 మంది రైతుల‌కు ఉచిత ట్రాక్ట‌ర్ల పంపిణీ
  • మొద‌టి ట్రాక్ట‌ర్‌ను విలుపురం జిల్లాకు చెందిన రాజ‌క‌న్న‌న్ కుటుంబానికి స్వ‌యంగా అంద‌జేసిన లారెన్స్‌
  • 'క‌ష్టాల్లో ఉన్న అన్న‌దాత‌ల‌కు అండ‌గా నిలుద్దాం. ఆనందం పంచుదాం' అంటూ ట్వీట్
హీరో, ద‌ర్శ‌కుడు రాఘ‌వ లారెన్స్ మ‌రోసారి ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నారు. గ‌తంలో పేద రైతుల‌కు ట్రాక్ట‌ర్లు ఇస్తాన‌న్న హామీని ఆయ‌న నెర‌వేర్చారు. ప‌ది మందికి త‌లో ట్రాక్ట‌ర్ అంద‌జేశారు. మొద‌టి ట్రాక్ట‌ర్‌ను విలుపురం జిల్లాకు చెందిన రాజ‌క‌న్న‌న్ కుటుంబానికి అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను లారెన్స్ త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. 'క‌ష్టాల్లో ఉన్న అన్న‌దాత‌ల‌కు అండ‌గా నిలుద్దాం. ఆనందం పంచుదాం' అని లారెన్స్ ట్వీట్ చేశారు. 

ఆ రైతు తన చెల్లి భర్త చనిపోవడంతో వారి ఫ్యామిలీని కూడా చూసుకుంటున్నాడు. తాను ఆ రైతు కళ్లలో ఆనందం చూడాలని, టీమ్‌తో వెళ్లి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చినట్లు లారెన్స్‌ తెలిపారు. రైతుకు ట్రాక్టర్ అందివ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే తాను ప్రెస్ మీట్‌లో నేను చెప్పినట్లుగా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులకు 10 ట్రాక్టర్లను అందజేస్తామ‌న్నారు.  లారెన్స్ పోస్ట్ చేసిన వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజ‌న్లు ఆయ‌న‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. రాఘవ లారెన్స్ గొప్ప మనుస్సును మెచ్చుకుంటున్నారు.
Advertisement
Raghava Lawrence
Tractor
Farmers

More Telugu News