పవన్ ని ఓడించకపోతే నా పేరు మార్చుకుంటా: ముద్రగడ చాలెంజ్
- రంగులు వేసుకుని వచ్చే వారిని ప్రజలు నమ్మరన్న ముద్రగడ
- ఎవరికైనా కాఫీ ఇవ్వడానికి కూడా పవన్ కు మనసు రాదని విమర్శ
- పవన్ టికెట్లు అమ్ముకున్నారని అంటున్నారని వ్యాఖ్య
వాళ్ల ఇంట్లో పది మంది ఉన్నారని... ఎవరి బర్త్ డే వచ్చినా వాళ్లింటికి కేకుతో పాటు, భోజనాలన్నీ ప్రొడ్యూసర్లు పంపించాలంట అని ముద్రగడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేక్ నుంచి ఫుడ్ వరకు నిర్మాతే భరించాలట అని అన్నారు. కాఫీ ఇవ్వడానికి కూడా పవన్ కు మనసు రాదని... ఆయనకు డబ్బే ప్రాణమని చెప్పారు. ఇతరులను గౌరవించే గుణం తనకు ఉందని అన్నారు.
కష్టమొస్తే మాట్లాడటానికి ఎవరికైనా ఫోన్ నెంబర్ ఇచ్చారా? అని పవన్ ను ముద్రగడ ప్రశ్నించారు. ఎవరినీ ప్రేమించరు, ఎవరినీ దగ్గరకు రానివ్వరని అన్నారు. పవన్ ను నమ్ముకుని నాశనమయ్యామని ఆయన పార్టీలో ఉన్నవారే అంటున్నారని చెప్పారు. రైతుల కోసం చందాలు వసూలు చేశామని చెపుతున్నారని... ఏ రైతుకు ఎంత ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. టికెట్లు కూడా అమ్ముకున్నారని అంటున్నారని చెప్పారు. పవన్ కు సినిమా ఆదాయం కంటే... రాజకీయాల్లో ఆదాయమే ఎక్కువని మీ సన్నిహితులే చెపుతున్నారని అన్నారు. పవన్ ఎవరికీ పెట్టరని, పెట్టమని చెప్పినా ఆయనకు నచ్చదని ఎద్దేవా చేశారు. తనను ఉప్మా, కాఫీ అనడానికి సిగ్గులేదూ? అని అన్నారు.