Pawan Kalyan: సంచలన వ్యాఖ్యలతో మరోసారి పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసిన పోతిన మహేశ్

Pothina Mahesh sensational comments on Pawan Kalyan
షార్ట్స్‌లో చూడండి
ఇటీవలే జనసేనకు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన బెజవాడ నేత పోతిన వెంకట మహేశ్ మరోసారి పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ అన్ని విధాలుగా దిగజారిపోయారని విమర్శించారు. వ్యక్తిగత జీవితంలో దిగజారిపోయారు... పార్టీలో దిగజారిపోయారు... పార్టీని తీసుకెళ్లి చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టి పూర్తిగా దిగజారిపోయారు అంటూ పోతిన మహేశ్ వ్యాఖ్యానించారు. 

"పవన్ కల్యాణ్ ఈ మధ్య మూడు పెళ్లాల మాటెత్తితే గింజుకుంటున్నాడు. మరి, వాలంటీర్లను పట్టుకుని 'మానవ అక్రమ రవాణాదారులు' అంటే కోపం రాదా ఎవరికైనా? నువ్వు ఎన్నికల అఫిడవిట్ లో మాయజేసినట్టు... పెళ్లిళ్ల విషయంలో, గొళ్లేల విషయంలో కూడా మాయ చేస్తున్నావా లేదా అనే దానికి సమాధానం చెప్పాలి. సంసారం చేసింది ఎంతమందితో, కడుపులు చేసి వదిలిపెట్టింది ఎంతమందిని అనేది పవన్ కల్యాణ్ అనే వ్యకి ఓ లిస్టు విడుదల చేస్తే, ఇక నుంచి ఆ లిస్టు ప్రకారం రాష్ట్రంలో అందరూ కూడా మాట్లాడతారు. 

రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. అంతేగానీ, నా ఇష్టానుసారం నేనుంటా, నేను ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకుంటా, ఎంతమందినైనా వదిలేస్తా, ఎంతమందికైనా కడుపులు చేస్తా అంటే సమాజం హర్షించదు. ముఖ్యమంత్రి గారు ఇదే మాట అంటే... మదమెక్కిన రీతిలో ఆయనను "పెళ్లాం" అని సంబోధిస్తున్నారు. మహిళలంటే పవన్ కల్యాణ్ అనే వ్యక్తికి ఎంత చిన్నచూపో దీన్నిబట్టే అర్థమవుతుంది. 

మహిళలంటే అంగట్లో సరుకు అని భావించే నీలాంటి వాళ్లకు మహిళలను గౌరవించడం ఎప్పటికీ తెలియదు. ఈ సందర్భంగా ఓ మాట అంటాను... వర్మ (పిఠాపురం టీడీపీ ఇన్చార్జి) గారు కోపం తెచ్చుకోకూడదు. వర్మకు రెండో భార్య పవన్ కల్యాణ్. నిన్న నామినేషన్ కు వెళుతూ వర్మ కాళ్లకు పవన్ వంగి దండం పెడితే... వర్మ పూలు చల్లి ఆశీర్వదించారు. వర్మ మొదటి భార్య ఇంట్లో ఉంటుంది, రెండో భార్య పవన్ కల్యాణ్. 

అసలు, చిరంజీవిని అవమానించింది ఎవరు? చిరంజీవిని పదే పదే అవమానిస్తుంది పవన్ కల్యాణ్ కాదా? కానిస్టేబుల్ గారి కొడుకునంటావ్, చిరంజీవి గారి వల్లే స్టార్ ని అయ్యానంటావ్... గతంలో చిరంజీవి గారి గురించి ఈ మాటలు బయటికొచ్చి ఎప్పుడైనా చెప్పావా? ఈ ఐదేళ్లలో ఎక్కడైనా చిరంజీవి గురించి పవన్ మాట్లాడావా? ఇప్పుడు అవవసరం కాబట్టి ఊగిపోతూ మాట్లాడుతున్నావు. 

తన తల్లిని అవమానించిన చంద్రబాబును, లోకేశ్ ను పక్కనే పెట్టుకుని పొత్తు కుదుర్చుకున్న పవన్ కల్యాణ్... ఇప్పుడు తన తల్లిని అవమానించినట్టు కాదా? రాష్ట్ర ప్రజలు ఇవన్నీ మర్చిపోయారనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, మీ ఇష్టం వచ్చినట్టు నటిస్తే, మీ ఇష్టం వచ్చినట్టు డ్రామాలు ఆడితే చెల్లుబాటు అవుతుందనుకుంటున్నారా? మీరు చేసే నటన, మాయ, మోసం అన్నింటినీ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. రాబోయ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ అనే వ్యక్తికి ప్రజల చేతుల్లో చెప్పుదెబ్బలు తప్పవు.

ఎవరైనా గుట్టుగా కాపురం చేసుకుంటుంటే భార్యలను బయటికి లాగాలని ఎవరూ అనుకోరు. ఇంట్లో భార్యను ఉంచుకుని వేరే వాళ్లకు కడుపు చేశారని మీతో కాపురం చేసిన మహిళ టీవీ ఇంటర్వ్యూలిస్తే ఆ విషయంపై మీరు ఎందుకు స్పందించలేదు. భర్తగా మీరు కళంకం తెచ్చారనే కదా ఆవిడ టీవీలో మాట్లాడారు... మీరు ఆ విషయంపై ఎందుకు వివరణ ఇవ్వడంలేదు? 

ఈ విషయాలు బయటపెట్టింది ఎవరు... మీ ఇంట్లో వాళ్లు కాదా? మీతో కాపురం చేసిన వాళ్లు కాదా? ఈ వాస్తవాలను రాజకీయ నాయకులు బయటపెట్టారా? వైసీపీ బయటపెట్టిందా? మీతో కాపురం చేసిన రేణూ దేశాయ్ గారే కదా బయటికొచ్చి టీవీ ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ చెప్పారు. 

ఎవరైనా తాను ఈ పనులు చేస్తానని చెప్పి ఓట్లు అడుగుతారు. కానీ పవన్ కల్యాణ్ ముందు నాకు ఓట్లు వేయండి... ఆ తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెబుతున్నాడు. ఇదేమి ఎన్నికల ప్రచారమో అర్థం కావడంలేదు" అంటూ పోతిన మహేశ్ ఓ రేంజిలో విరుచుకుపడ్డారు.
Go Back to Shorts
Pawan Kalyan
Pothin Mahesh
YSRCP
Janasena
Vijayawada

More Telugu News