DK Aruna: అలాగైతే నాపై విమర్శలు ఎందుకు?.. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు డీకే అరుణ స్ట్రాంగ్ కౌంటర్

BJP leader DK Aruna strong counter to CM Revanth Reddy
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీజేపీ నేత, మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఫైరయ్యారు. రేవంత్‌రెడ్డికి తాను పోటీకానప్పుడు తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. నిన్న కొడంగల్‌లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. పాలమూరు బిడ్డలు తనకు నూటికి నూరుశాతం అండగా నిలబడ్డారని, అలాంటి తనకు మీ మీద అసూయ, కోపం ఎందుకు ఉంటుందని అరుణను ఉద్దేశించి ప్రశ్నించారు. ఆమెకు, తనకు పోటీ, పొంతన ఏంటన్నారు. పాలమూరు జిల్లాలో తనకు శత్రువులు కానీ, ప్రత్యర్థులు కానీ లేరని తెగేసి చెప్పారు. 

రేవంత్ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన అరుణ.. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని దేవుళ్లపై సీఎం ప్రమాణం చేస్తున్నారని, కానీ దేవుళ్లపై కాకుండా కుటుంబ సభ్యులపై ప్రమాణం చేస్తేనే ప్రజలు నమ్ముతారని అన్నారు.  దేవుళ్లపై కాంగ్రెస్‌కు నమ్మకం లేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డికి తాను సాటికానప్పుడు తనపై విమర్శలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను రేవంత్ నెరవేర్చాలని అరుణ డిమాండ్ చేశారు.
Go Back to Shorts
DK Aruna
Revanth Reddy
Mahbubnagar District
BJP
Congress

More Telugu News