కోటికి చేరువైన ‘ఇంటింటికీ తెలుగుదేశం–2026’

Telugu Desam Party Intintiki Telugu Desam 2026 nears one crore mark
  • 37వ రోజుకు చేరిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం
  • ఇప్పటివరకు 97 లక్షలకు పైగా ఇళ్లను సందర్శించిన టీడీపీ శ్రేణులు
  • రెండేళ్ల పాలనపై ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరణ
  • కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన
  • మంగళవారం ఒక్కరోజే లక్షన్నరకు పైగా ఇళ్ల సందర్శన
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతోంది. మంగళవారం నాటికి ఈ కార్యక్రమం 37వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 97.32 లక్షల ఇళ్లను సందర్శించి, కోటి ఇళ్ల సందర్శన లక్ష్యానికి చేరువయ్యారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, ఈ రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం, ప్రభుత్వ పనితీరుపై వారి అభిప్రాయాలను నేరుగా తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 1,52,172 ఇళ్లను టీడీపీ శ్రేణులు సందర్శించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి గడప తట్టి, కుటుంబ సభ్యులతో నేరుగా సంభాషిస్తున్నారు. రైతులు, మహిళలు, యువత, పేదలు, మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను తెలియజేస్తున్నారు. అదే సమయంలో, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వారి అభిప్రాయాలను నమోదు చేసుకుంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని, ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఈ స్పందనతో మరింత ఉత్సాహంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నట్లు వారు పేర్కొన్నారు.
Advertisement
Telugu Desam Party
Intintiki Telugu Desam
Andhra Pradesh Politics
TDP Welfare Schemes
TDP Door to Door Campaign
Andhra Pradesh Development

More Telugu News