కిర్గిజ్‌స్థాన్‌లో తెలుగు విద్యార్థి మృతి
- విహార యాత్రలో విషాదం
- మంచులో కూరుకుపోవడంతో దాసరి చందు అనే విద్యార్థి మృతి
- వైద్య విద్య కోసం ఏడాది కిందటే కిర్గిజ్‌స్థాన్ వెళ్లిన చందు
- అనకాపల్లిలోని మాడుగులకు చెందిన విద్యార్థి
కాగా దాసరి చందు స్వస్థలం అనకాపల్లి జిల్లాలోని మాడుగుల అని కుటుంబ సభ్యులు తెలిపారు. చందు తండ్రి భీమరాజు హల్వా వ్యాపారి అని, చందు రెండవ కుమారుడు అని తెలిపారు. ఎంబీబీఎస్ చదివేందుకు ఏడాది కిందట కిర్గిజ్‌స్థాన్ వెళ్లాడని వివరించారు. చందు మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సాయం చేస్తున్నారని అనకాపల్లి ఎంపీ సత్యవతి తెలిపారు. కిర్గిజ్‌స్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడారని ఆమె చెప్పారు.