ఏపీ సీఈవో నోటీసులకు నారా లోకేశ్ వివరణ
- సైకో పోవాలి సైకిల్ రావాలి పాటపై సీఈవోకు ఫిర్యాదు చేసిన వైసీపీ
- నారా లోకేశ్ కు నోటీసులు
- కోడ్ రాకముందే ఆ పాటను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారన్న లోకేశ్
- చంద్రబాబు, పవన్ పై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని సీఈవోకు ఫిర్యాదు
మేమంతా సిద్ధం సభల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని లోకేశ్ ఈ సందర్భంగా సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. భీమవరం సభలో సీఎం జగన్ ఎన్నికల నియమావళి అతిక్రమించారని ఫిర్యాదు చేశారు. వైసీపీ సోషల్ మీడియాలో ప్రతిపక్షాలపై అసత్య ప్రచారం చేస్తున్నాయని కూడా లోకేశ్ సీఈవోకు ఫిర్యాదు చేశారు.