Hariharaveeramallu: హరిహర వీరమల్లు టీజర్ వచ్చేస్తోంది

Hariharaveeramallu Update Coming Be Ready
షార్ట్స్‌లో చూడండి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా 'హరిహర వీరమల్లు'కు సంబంధించిన తాజా అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా టీజర్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని అధికారికంగా వెల్లడించనప్పటికీ టీజర్ విడుదలకు సంబంధించి ఈ సినిమా మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ఈ సినిమా షూటింగ్ కు హాజరుకాలేక పోతున్నారు. దీంతో షూటింగ్ మొదలై చాలా రోజులు అయినప్పటికీ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఇంకా సగం కూడా కాలేదని తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘మీ ముందుకు ధర్మం కోసం యుద్ధం త్వరలో..’ అంటూ పవన్ కల్యాణ్ ఫొటోతో ఈ పోస్టర్ ను రూపొందించారు. హరిహర వీరమల్లు సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. క్రిష్‌ టీం ఇప్పటికే రిలీజ్‌ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలతో పవన్ కల్యాణ్ అభిమానులలో హరిహర వీరమల్లు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Go Back to Shorts
Hariharaveeramallu
Pawan Kalyan
PK New Movie
Hariharaveeramallu Teaser
Janasena
AP Assembly Polls

More Telugu News