పెద్దిరెడ్డి అంతులేని అవినీతికి పాల్పడ్డారు: వైఎస్ షర్మిల
- పీలేరు నియోజకవర్గంలో షర్మిల ప్రచారం
- పీలేరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి చేతిలో రబ్బరు బొమ్మ అని వ్యాఖ్య
- జగన్, చంద్రబాబు ప్రజలను మోసం చేశారని విమర్శ
ఏపీకి ప్రత్యేక హోదా సంజీవనిలాంటిదని చెప్పారు. హోదా వచ్చి ఉంటే రాష్ట్రంలో వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవని తెలిపారు. ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలని పట్టుబట్టిన బాబు... ఆ తర్వాత హోదాను పక్కన పెట్టేశారని విమర్శించారు. మెడలు వంచి హోదా తెస్తామన్న జగన్... రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర వద్ద తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. పీలేరు బహిరంగసభలో మాట్లాడుతూ షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు.