Indian 2: పోస్ట్ ప్రొడక్షన్ దశలో కమల్ హాసన్ 'ఇండియన్-2'

Post production works for Indian 2 gets brisk pace
షార్ట్స్‌లో చూడండి
యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం భారతీయుడు-2. గతంలో వీరిద్దరూ భారతీయుడు చిత్రంతో బాక్సాఫీసు వద్ద మోత మోగించారు. 

క‌మర్షియ‌ల్‌గా భారీ చిత్రాల‌ను అద్భుతం అని అంద‌రూ మెచ్చుకునేలా తెర‌కెక్కించ‌టంలో శంకర్ సుప్ర‌సిద్ధుడు. ఆయ‌న సినిమాల్లో గొప్ప సామాజిక సందేశం కూడా ఉంటుంది. ఎలాంటి పాత్రలోనైనా పరకాయప్రవేశం చేసే కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్ద‌రూ చేతులు క‌లిపారంటే అద్భుత‌మైన సినిమా మ‌న ముందుకు వ‌స్తుంద‌న‌టంలో సందేహం లేదు. భార‌తీయుడు (ఇండియ‌న్‌) సినిమాతో అది నిరూపిత‌మైంది. 

ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రూ క‌లిసి ‘భార‌తీయుడు 2’తో సిల్వ‌ర్ స్క్రీన్‌పై మాయ చేయ‌బోతున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జెయింట్ మూవీస్ రూపొందిస్తోన్న ‘భార‌తీయుడు 2’ సినిమాపై ముందు నుంచి భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. దానికి అనుగుణంగానే ప్ర‌మోష‌న‌ల్ ప్లానింగ్‌తో సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతూ వ‌స్తున్నారు. 

ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసిన శంక‌ర్ ఇప్పుడు నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేయ‌టంపై దృష్టి సారించారు. మే నెలాఖ‌రున ప‌వ‌ర్‌ప్యాక్డ్ ట్రైల‌ర్‌ను తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. భారతీయుడు-2 చిత్రాన్ని జూన్‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 

క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Go Back to Shorts
Indian 2
Post Production
Kamal Haasan
Shankar
Lyca Productions
Red Giant Movies

More Telugu News