నా భర్తకు గుండెపోటు వచ్చింది.. ఇప్పుడు కోలుకున్నారు: సినీనటి సనా

Sana reveals her husband undergone surgery
  • దురదృష్టవశాత్తు తన భర్త గుండెపోటుకు గురయ్యారన్న సనా
  • అల్లా దయ వల్ల సర్జరీ విజయవంతం అయిందని వెల్లడి
  • అందరి ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానన్న సనా
తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైన క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో సనా ఒకరు. వందల సినిమాల్లో నటించిన సనా... ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. తొలినాళ్లలో ఆమెకు హీరోయిన్ అవకాశాలు వచ్చినప్పటికీ... ఎక్కడ ఎక్స్ పోజింగ్ చేయాల్సి వస్తుందోనని హీరోయిన్ ఛాన్సులను ఆమె వదులుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది. మరోవైపు, సోషల్ మీడియాలో సనా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే కొన్ని రోజుల నుంచి ఇన్స్టాలో ఆమె ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. రంజాన్ పండుగ సమయం సందర్భంలో కూడా సైలెంట్ గా ఉండటంతో ఆమె అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కారణం ఏమిటనే దానిపై ఆరా తీస్తూ మెసేజ్ లు పెట్టారు. దీంతో, సోషల్ మీడియాలో గ్యాప్ ఇవ్వడానికి గత కారణం ఏమిటో ఆమె వెల్లడించింది. 

దురదృష్టవశాత్తు తన భర్తకు ఇటీవలే గుండెపోటు వచ్చిందని సనా తెలిపారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లామని.. దీంతో, పెద్ద గండం తప్పిందని చెప్పారు. అల్లా దయ వల్ల సర్జరీ విజయవంతం అయిందని తెలిపారు. అందరి అభిమానాలు తమపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.
Advertisement
Sana
Tollywood
Husband
Heart Attack

More Telugu News