తణుకులో రోడ్ షో... ఒకే వాహనంపై చంద్రబాబు, పవన్

Chandrababu and Pawan Kalyan attends road show in Tanuku
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మూడు పార్టీలు కలిసి ప్రజాగళం సభ ఏర్పాటు చేశాయి. ఈ సభ కోసం తణుకు వచ్చిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి రోడ్ షో నిర్వహించారు. తణుకు పట్టణంలోని నరేంద్ర సెంటర్ వరకు భారీ జనసందోహం వెంటరాగా చంద్రబాబు, పవన్ ఒకే వాహనంపై రోడ్ షోలో పాల్గొన్నారు. దారిపొడవునా కూటమి పార్టీల శ్రేణులు పూల వర్షం కురిపించారు. నినాదాలతో హోరెత్తించారు.
Go Back to Shorts
Praja Galam
Road Show
Tanuku
Chandrababu
Pawan Kalyan
TDP-JanaSena-BJP Alliance

More Telugu News