ఉప్పల్ క్రికెట్ స్టేడియంకు సీఎం రేవంత్ రెడ్డి!
- క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు సాయంత్రం ఉప్పల్ స్టేడియానికి సీఎం
- ఫ్యామిలీతో కలిసి ఐపీఎల్ మ్యాచ్ చూడనున్న రేవంత్ రెడ్డి
- రాత్రి 7.30 గంటలకు సీఎస్‌కే, ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్
ఇక మ్యాచ్ విషయానికి వస్తే రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. కొన్ని రోజుల క్రితం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ చేసిన విధ్వంసాన్ని ఇవాళ్టి చెన్నై మ్యాచులో కూడా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, సీఎస్‌కే, ఎస్ఆర్‌హెచ్ తమ చివరి మ్యాచుల్లో ఓటమి చవిచూశాయి. మూడు మ్యాచులు ఆడిన చెన్నై రెండు గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. అలాగే మూడు మ్యాచులు ఆడిన హైదరాబాద్ ఒకేఒక విజయంతో 7వ స్థానంలో కొనసాగుతోంది. ఈరోజు గెలిస్తే హైదరాబాద్ ఐదో స్థానానికి ఎగబాకుతుంది.