వైజాగ్ లో నేడు మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్... టాస్ గెలిచిన కోల్ కతా
- ఐపీఎల్ లో నేడు కేకేఆర్ × ఢిల్లీ క్యాపిటల్స్
- విశాఖ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్ కతా
ఈ సీజన్ లో కోల్ కతా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లో నెగ్గి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు ఢిల్లీ జట్టు ఆడిన 3 మ్యాచ్ ల్లో రెండింట్లో ఓడిపోయి, ఒక మ్యాచ్ లో నెగ్గింది. ఈ మ్యాచ్ ఢిల్లీకి ఎంతో కీలకం.
ఇరుజట్లలోనూ గమనించదగ్గ ఆటగాళ్లు...
కోల్ కతా నైట్ రైడర్స్: రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, శ్రేయాస్ అయ్యర్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి.
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, ట్రిస్టాన్ స్టబ్స్.