ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు చంద్రబాబు వర్క్ షాప్
- ఈ మధ్యాహ్నం 1.30 గంటల వరకు వర్క్ షాప్
- కీలక ప్రసంగం చేయనున్న చంద్రబాబు
- వ్యూహాలను ఎలా అమలు చేయాలనే దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న చంద్రబాబు
ఉదయం 10 గంటలకు ప్రారంభమైన వర్క్ షాప్ మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుంది. 11 గంటలకు వర్క్ షాప్ ను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఈ వర్క్ షాప్ కు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు... వారు ప్రత్యేకంగా నియమించుకున్న నలుగురు మేనేజర్లు కూడా హాజరుకాబోతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అధికార వైసీపీ పార్టీ కుట్రలు వంటి అంశాలపై చర్చించనున్నారు. ఎన్నికల్లో ఎలా ప్రచారం నిర్వహించాలి, అభ్యర్థులు ఎలాంటి పద్ధతులను అనుసరించాలి, వ్యూహాలను ఎలా అమలు చేయాలి అనే దానిపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.