కవిత అరెస్ట్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా వెనుక బీజేపీ: అద్దంకి దయాకర్
- ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల డ్రామా అని విమర్శ
- నోటిఫికేషన్ కంటే ముందే అరెస్ట్ పేరుతో రాజకీయ డ్రామాను తెరపైకి తెచ్చాయని మండిపాటు
- దక్షిణాదిన తన బలం పెంచుకోవడానికి బీజేపీ ఎత్తుగడ అని వ్యాఖ్య
ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే అరెస్ట్ పేరుతో రాజకీయ డ్రామాను తెరపైకి తెచ్చారన్నారు. ఢిల్లీ మద్యం కేసును ఓ వెబ్ సిరీస్‌లా నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి డ్రామాలను తెలంగాణ ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. దక్షిణాదిన తన బలం పెంచుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని.. ఇందులో భాగంగా ఈ ఎత్తుగడ వేసిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బీజేపీ సహకరిస్తే... పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకరిస్తోందన్నారు.