రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతే వారిదే బాధ్యత: బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

BJP laxman hot comments on revanth reddy government
  • కాంగ్రెస్ నేతలు వాళ్లంతట వాళ్లే ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటే వారిదే బాధ్యత అన్న లక్ష్మణ్
  • పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్‌కు మార్గం సుగమమవుతుందని వ్యాఖ్య
  • అయిదేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది బీజేపీయేనని ధీమా
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వాళ్లంతట వాళ్లే ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటే బాధ్యత కూడా వారిదే అవుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్‌కు మార్గం సుగమం అవుతుందన్నారు.

అయిదేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌తో బీజేపీకి ఒప్పందం ఉందని నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీంతో లక్ష్మణ్ దీటుగా కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బీఆర్ఎస్‌ను బీజేపీ ఉపేక్షించే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ చచ్చిన పాము అని... బీఆర్ఎస్‌ను బీజేపీ బతికించదన్నారు.
Advertisement
dr k laxman
BJP
Telangana
Revanth Reddy

More Telugu News